ఉధృతంగా వరద : నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తివేత

-

నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో.. నాలుగు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు చెందిన14 క్రష్ట్ గేట్లు ఎత్తివేశారు అధికారులు. ప్రస్తుతగం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 5,14,386 క్యూసెక్కులకు చేరుకోగా… అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరుకుంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా… ప్రస్తుత ప్రాజెక్ట్ నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి నిలువ 300 టీఎంసీలు గా ఉంది. భారీగా వరద రావడంతో నాగార్జునసాగర్ కు చెందిన 14 క్రస్ట్ గేట్లను ఇవాళ సాయంత్రం ఐదు అడుగుల మేర లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అటు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు లో నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్ ప్రవహిస్తోంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కు సుమారు లక్ష క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version