ఆరు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడు : నాంపలి కోర్టు సంచలన తీర్పు

-

ఈ మధ్య కాలంలో ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లిళ్లు చేసుకోవడం కామన్‌ అయిపోయింది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు అనే తేడా లేకుండా.. ఇద్దరూ ఇలా పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లి కొడుకుకు ఊహించని షాక్‌ ఇచ్చింది నాంపల్లి కోర్టు.

ఆరు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లి కొడుకు పదేళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. ఒకరికి తెలియకుండా మరోకరిని అలా ఏకంగా… ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారు రంగస్వామి అనే వ్యక్తి. ఉద్యోగాలు చేసే మహిళలను టార్గెట్ చేసిన రంగస్వామి.. ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు.

మహిళలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపిన రంగస్వామి.. ఆ మహిళల దగ్గర లక్షల్లో డబ్బులు గుంజి మొహం చాటేశాడు. ఇలా ఆరుగురు మహిళను పెళ్లి చేసుకున్న రంగస్వామి… చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్‌ అయ్యాడు. గోవాలో ఇటీవల రంగస్వామిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే..ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. రంగస్వామి కి 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version