కనీసం ఒక్క అవార్డు అయినా వస్తుందని భావించా… కానీ: నాని

-

ఈ మధ్యన జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులలో చాలా సినిమాలకు అవార్డులు వచ్చాయి.. కానీ జై భీం లాంటి సమాజానికి ఉపయోగపడిన సినిమాను మాత్రం ఒక్క అవార్డు కూడా రాకపోవడం చాలామందిని బాధించింది, ముఖ్యంగా ఈ సినిమా బృందాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ విషయం పట్ల సహజనటుడు నాని సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ మెసేజ్ పై అందరూ ఒక్కో విధంగా మాట్లాడుతుంటే మరోసారి క్లారిటీ ఇచ్చారు నాని. టాలీవుడ్ కు జాతీయ అవార్డులు రావడం సంతోషించే విషయమే, ఆర్ ఆర్ ఆర్ , పుష్ప మరియు బన్నీ కి అవార్డులు రావడం మంచిదే అంటూ నాని చెప్పారు. కానీ జైభీమ్ కు కూడా ఏదో ఒక విభాగంలో అవార్డు వస్తుందని అనుకున్నాను, కానీ రాకపోవడంతో చాలా బాధ మరియు నిరాశ కలిగాయి అంటూ నాని ఈ మెసేజ్ గురించి తెలియచేశారు.

ఇప్పుడు నాని నిరాశ వెనుక ఎంత బాధ కలిగిందో అందరికీ అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version