కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది : రేవంత్ రెడ్డి

-

కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ భవిష్యత్ ను మీరు నిర్ణయించబోతున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు కామారెడ్డి ప్రజలు ఇవ్వబోయే తీర్పును ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల నుంచి పరిపాలిస్తున్న కేసీఆర్ ని ఓడించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధమయ్యారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. లింబయ్య అనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చనిపోతే.. కుటుంబ తగాదాల వల్లనే రైతు లింబయ్య మరణించాడని కేసీఆర్ ప్రభుత్వం కట్టుకథ అల్లిందని తెలిపారు. రైతులు మరణిస్తే.. కేసీఆర్ కుటుంబం ఆదుకోలేదు. ఆనాడు రాని ముఖ్యమంత్రి ఇవాళ వచ్చి కోనాపూర్ మా కన్న తల్లి పుట్టిన ఊరు అని కథ చెబుతున్నారు. పదేళ్ల తరువాత కామారెడ్డి గుర్తుకొచ్చిందా..? అని ప్రశ్నించారు.

పేద రైతుల భూములు కోల్పోయారు. మీ చుట్టాలకు సంబంధించిన భూములు బాగానే ఉన్నాయి. పేద రైతుల భూములు మాత్రం మలన్నసాగర్ లో మునిగిపోయాయి. కేసీఆర్ ఏ రోజు కూడా సచివాలయానికి రాలేదని తెలిపారు రేవంత్ రెడ్డి. పదేళ్ల నుంచి పట్టించుకోని నువ్వు కామారెడ్డిని ఇవాళ బంగారు తునక ఎలా చేస్తావని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version