బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారు : నారా లోకేశ్‌

-

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ బీసీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారని లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిని జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక మంత్రి పేషీకి తాళం వేశారని ఎద్దేవా చేశారు లోకేశ్.

తాము అధికారంలోకి వస్తే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నిధులు కేటాయించి కార్పొరేషన్లను
బలోపేతం చేస్తామని, ఉప కులాల వారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. జగన్ పాలనలో ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని అన్నారు. టీడీపీ గెలిచాక సబ్సిడీతో విద్యుత్ అందిస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని జగన్ మోసం చేశారని, అధికారంలోకి రాగానే పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడంలేదని, తాము అధికారంలోకి వస్తే గొర్రెలు కొనడానికి రుణాలు అందిస్తామని, సబ్సిడీపై మందులు కూడా ఇస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version