నాలుగు వారాలుగా రాజధాని అమరావతి కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో మాజీ సీఎం చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ సైతం అన్నదాతల ఆందోళనలకు మద్దతిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రవరిస్తోన్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ పలు ఫొటోలను పోస్టు చేశారు. నిరసనలో కూర్చున్న చిన్న పిల్లాడిని పోలీసులు వ్యానులో ఎక్కించిన ఫొటో కూడా అందులో ఉంది. మరోవైపు, ఓ యువతితో భద్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తించినట్లు ఓ ఫొటోలో స్పష్టంగా కనపడుతోంది.
‘చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్ గారు. వైకాపా రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం’ అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెబితే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళలపై జగన్ గారికి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్థం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని లోకేశ్ నిలదీశారు.
చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు @ysjagan గారు. వైకాపా రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం.(1/2) pic.twitter.com/e1TrtRMCd5
— Lokesh Nara (@naralokesh) January 11, 2020