రోజురోజుకు ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించి.. ట్విట్టర్లో.. మాజీమంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్ గా చెప్పటం షాక్ కు గురిచేసిందని. టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తోందన్నది బహిర్గతమైందన్నారు. అంతేకాకుండా ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఏపీ మారుతోందని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. టెన్త్ పేపర్ లీకుల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నారాయణ అరెస్ట్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నారాయణ ఫోన్ ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. దీంతో పై విధంగా నారాలోకేష్ స్పందించారు.