జగన్ అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతుందని అన్నారు.రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇస్తుందని,బాధితుల పక్షానే కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనని తలపిస్తోందని ఎద్దేవా చేశారు.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణమని అన్నారు నారా లోకేష్.
సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలని సూచించారు.అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు.వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవమృగాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే వారికి భయం పుట్టేది అని ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.