ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజలకు సమస్యలు చెప్పుకోడానికి నిర్మించిన ప్రజా వేదిక భవానాన్ని వైసీపీ ప్రభుత్వం ఒక్కరాత్రిలో కూల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికీ సంవత్సరం అయ్యింది. ఇక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ద్వారా పోస్ట్ చేశారు. వైసీపీ చేసిన ఆ చర్య ఎంతో దుర్మార్గం అని ఆయన వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్తాఃయిలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ… ఒక భవనం కట్టడం ఎంతో కష్టం, ప్రజావేధిక ప్రజలకు ఎంతో ఉపయోగం. కూలగొట్టడం చిటికెలో పని, పైగా తీవ్ర నష్టం…! ఇది తెలిసి కూడా విధ్వంసానికే జైకొడుతున్నారు, ఇటువంటివారిని పాలకుడిగా ఎన్నుకున్న పాపానికి ప్రజల సమస్యల పరిష్కారవేదికైన ప్రజావేదిక కూలగొట్టి.. ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి సమాధి కట్టి ఏడాది అవుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాత, జగన్‌రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి అని ఆయన మండిపడ్డారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదికని కడితే, ఒక్క రాత్రిలో కూల్చేశారు జగన్‌రెడ్డి అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ఒక భవనం కట్టడం ఎంతో కష్టం, ఉపయోగం. కూలగొట్టడం చిటికెలో పని, తీవ్ర నష్టం. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జైకొడుతున్నారు @ysjagan.(1/4)#1YearForPrajaVedikaDemolition pic.twitter.com/CsX6hZDEUR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 25, 2020
చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాత, జగన్‌రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి.(3/4)#1YearForPrajaVedikaDemolition pic.twitter.com/c40IVqWorX
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 25, 2020