ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సిఐడి పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కోర్ట్ లు ఇస్తున్న తీర్పులు చంద్రబాబు కు ఏమాత్రం అనుకూలంగా ఉండడం లేదు.. ఈ కారణంగా నేతలలో మరియు చంద్రబాబు లో అసంతృప్తి ఎక్కువైంది. ఒకవైపు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ప్రయత్నాలు చేసి గత రాత్రి తిరిగి విజయవాడకు చేరుకున్నారు. వచ్చి రాగానే ఈ రోజు ఉదయం చంద్రబాబు ను జైలుకు వెళ్లి కలిసి ఆయనతో చర్చిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన నారా లోకేష్… చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, ప్రజల కోసం పోరాడిన పాపానికి ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ క్లారిటీ ఇచ్చారు.
కేవలం చంద్రబాబు రాజకీయ కక్ష కోసమే అరెస్ట్ చేశారంటూ నారా లోకేష్ ఈ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది అన్నారు నారా లోకేష్.