చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉంది: నారా లోకేష్

-

ఢిల్లీ లో కొన్ని రోజులపాటు చంద్రబాబు కేసు గురించి న్యాయపరమైన సలహాల కోసం వెళ్లిన నారా లోకేష్ నిన్ననే ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ లో జరిగిన సంగతులను తండ్రికి వివరించడానికి రాజమండ్రి జైలుకు ఈ ఉదయమే వెళ్లారు. ఆయనను కలిసి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు భద్రతపై మాకు సందేహాలు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. జైల్లో నక్సలైట్లు, గంజాయి అమ్మేవారు, క్రిమినల్స్ కూడా ఉండడంతో ఆయన భద్రతపై చాల భయంగా ఉందంటూ లోకేష్ ఆరోపించడం జరిగింది. ఇంకా కొందరు జైలుపై దాడి చేస్తామని కూడా లేక రాశారంటూ లోకేష్ చెప్పారు. ఈ కారణాలు అన్నిటినీ చూపిస్తూ జైలులో సరైన భద్రత లేదని లోకేష్ చెప్పారు. కానీ ఎలాగు రిమాండ్ ను మరికొంతకాలం పెంచడంతో ఎలాగు జైల్లో ఉండక తప్పదు.

ఇక మిగిలిన కేసుల్లోనూ చంద్రబాబుకు ఉపశమనం దొరకలేదు.. మరి ముందు ముందు చంద్రబాబు ఈ కేసుల నుండి ఎలా బయటపడనున్నాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news