కొండగట్టు అంజన్న బక్తుల కల నెరవేరబోతోంది. ఎప్పటి నుండో కొండపై భక్తులు రవళి అనుకుంటున్న గదులు రాబోతున్నాయి. కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు వచ్చింది. అయితే ఈ గదుల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసారుచొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. టీటీడీ నుండి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులతో కలసి స్థల పరిశీలన చేసారు ఎమ్మెల్యే, ఆలయ ఈఓ.
అనంతరం MLA సత్యం మాట్లాడుతూ.. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉంది. గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసింది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో కొండగట్టును అభివృద్ది చేసుకుంటాం. త్వరలోనే 100 గదుల నిర్మాణం చేపడతాం. అలాగే త్వరలో కొండగట్టు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ ఖరారు చేస్తాం అని పేర్కొన్నారు. అయితే ఈ సర్వేలో టీటీడీ నుండి డీఈ పీవీ నాగరాజు, ఏఈ జే నాగరాజులు పాల్గొన్నారు.