రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది: నారా లోకేశ్ ఆస‌క్తిక‌ర ట్విట్‌

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే ఈ విమ‌ర్శ‌ల‌న్నీ లోకేష్ ట్విట‌ర్ ఖాతాలో పంచుకున్నారు. ‘పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైంది’ అని ట్వీట్ చేశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు గారి మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారు’ అని విమర్శించారు.

‘రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టీడీపీకి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు’ అని చెప్పారు. ‘ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టీడీపీకి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవు’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version