దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్త గా పేరొందిన వాడు ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల సమయంలో మోడీకి ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసి మోడీ ప్రధాని అవటానికి బాగా కృషి చేశారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాలకు చెందిన ఎన్నికలలో ఆయా పార్టీలకు పనిచేసి సదరు పార్టీలను తన వ్యూహాలతో అధికారంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా వైయస్ జగన్…ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర స్టార్ట్ చేసిన నాటి నుండి వైసిపికి ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసి వైసిపి పార్టీని అధికారంలోకి తీసుకు రావడం జరిగింది ప్రశాంత్ కిషోర్.
అటువంటి ప్రశాంత్ కిషోర్ త్వరలో సొంత పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ ది బీహార్ రాష్ట్రం. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కి పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో పార్టీ నుండి బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా నితీష్ కుమార్ తో కూడా విభేదాలు జరగటంతో ఇద్దరిమధ్య వాగ్వాదాలు గట్టిగా అయినట్లు సమాచారం.
దీంతో దేశంలోనే అందరికీ మతిపోయే విధంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారని జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరిలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోపు పార్టీ పెట్టి బీహార్ లో గెలవడానికి పీకే అదిరిపోయే ప్లాన్ వేసినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో వామ్మో ఇది సూపర్ బ్రేకింగ్ న్యూస్ అని అంటున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది అని చంకలు గుద్దుకుంటున్న బిజెపికి పీకే సొంత పార్టీ రూపంలో టఫ్ వార్ భవిష్యత్తులో జరగొచ్చని మరికొంతమంది నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు.