అప్రమత్తంగా లేకపోతే.. ప్రాణాలే పోయే ప్రమాదం : నారా లోకేష్‌

-

మరోసారి రాష్ట్ర ప్రభుత్వంకు చురకలంటిస్తూనే ఆర్‌బీబీ అధికారులకు లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. అయితే తాజాగా… ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శికి నారా లోకేష్ లేఖ రాశారు. రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉండటంతో.. విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు నారా లోకేష్. తక్షణమే రహదారి మరమ్మతులు చేయాలని, రాష్ట్రంలో లో మూడున్నరేళ్లుగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు నారా లోకేష్. రహదారులతో పాటు మౌలిక సదుపాయాలుంటేనే.. విద్య, వైద్య ఇతర రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుందని లేఖలో లోకేష్‌ తెలిపారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని నారా లోకేష్ అన్నారు.

దాదాపుగా అన్ని ప్రధాన రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయని, ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ రోడ్లమీద ప్రయాణమెట్లా..? మహాప్రభో.. అని ప్రజలు హడలిపోతున్నారని, చాలా వరకు ప్రధాన రోడ్లన్నీ. గుంతలతో నిండి ఉన్నాయన్నారు నారా లోకేష్. రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయని నారా లోకేష్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version