వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఅర్ చేసింది ఏంటి..? : వైఎస్‌ షర్మిల

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మంచిర్యాల జిల్లాలో మాట్లాడుతూ.. వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఅర్ చేసింది ఎంటి..? ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి ఈ జిల్లాకు అన్యాయం చేశారు. తమ్మిడి హాట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే అదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. కేసీఅర్ కనీసం ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేక పోయారు. అయినా తమ్మిడి హట్టి చేస్తా అన్నారు… తట్టెడు మట్టి కూడా తీయలేదు. వార్ధా ప్రాజెక్ట్ పూర్తి చేసినా లక్ష ఎకరాలకు సాగు నీరు వచ్చేది..ఇప్పటి వరకు ఎందుకు కట్టలేక పోయారు..? ఈ మంచిర్యాల జిల్లా సింగరేణి జిల్లా. అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు తవ్వుత అన్నారు…ఓపెన్ కాస్ట్ బంద్ అన్నారు.. ఏది జరగలేదు.

సింగరేణి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణానికి 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నారు .ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సింగరేణి కార్మికులకు సైతం మోసం చేశారు. ఈ జిల్లాలో 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఅర్ పట్టాలు ఇస్తామని మోసం చేశారు. పోడు పట్టాలపై అడిగితే మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నట్లు..? ఈ యంత్రాంగం ఎందుకు ఉన్నట్లు..ఈ మంత్రులు ఎందుకు ఉన్నట్లు..? ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version