డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ సంచలనం వ్యాఖ్యలు..నాపై పార్టీలోనే కుట్రలు !

-

డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ సంచలనం వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీలో నాపై కుట్ర జరుగుతోందని.. నాతప్పు ఉందని…అవినీతి చేశాను ఎవరైనా నిరుపిస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటానని వెల్లడించారు. రేపు జగనన్నకు నాపై నిజంగా తీవ్రంగా కోపం వచ్చే పరిస్థితి… కూడా వస్తా ఉందని.. వైసీపీలో పార్టీ శ్రేణులు, అమాయక ప్రజలను రెచ్చగొడితే వారిని పార్టీ నుంచి బహిష్కరించే రోజులొస్తాయని తెలిపారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోవాలని.. కుట్రంతా గంగాధరనెల్లూరు నియోజక వర్గంలోని ఒక మండలంలోనే జరుగుతోందని పేర్కొన్నారు.  ‘నన్ను అవమానించిన విషయం చెబితే ఎంతవరకు పోతుందో, ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేదని అ ప్రభుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఒక నాయకుని… నియోజక వర్గంలో ఒకే ఒక మండలంలోని ఒక నాయకుడికి 13 కోట్ల నుంచి 14 కోట్ల రోడ్డు పనులు కూడా ఇచ్చానని గుర్తు చేశారు.

కానీ నియోజక వర్గంలోని ఎంపీటీసీలు, సర్పం చులు, జడ్పీటీసీలు ఈ నెల 11వ తేదీన పెనుమూరు మండలం రావాలంటూ నాకు వ్యతిరేకంగా మెసేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం వల్ల తాను స్పందించాల్సి వచ్చిందని వివరించారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version