ఈ వీడియోని చూసి ఆ హీరోయిన్ ని గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్స్..!

-

ఈమధ్య కాలంలో హీరోయిన్లు సినిమాలలో అవకాశాల కోసం చాలా సన్నబడి పోతుంటే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం నెటిజెన్స్ చూసి ఆశ్చర్యపోయే విధంగా బరువెక్కి పోయింది. మొన్నటికి మొన్న బక్కపీలగా కనిపించిన ఈమె ముఖాన్ని చూసి అందరూ చాలా బాగుందని అనుకునే లోపే తాజాగా ఈమె వదిలిన ఒక వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . అందులో నివేదా థామస్ చాలా లావుగా కనిపిస్తున్నట్లు ఈ వీడియోలో మనం గమనించవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నేటి కాలం యువతకు క్రష్ గా మారిపోయింది. మొదటిసారి నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా 2016లో ఇండస్ట్రీకి పరిచయమైన నివేద ఆ తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ మరింత గుర్తింపును సొంతం చేసుకుంటోంది.

సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాదు రజినీకాంత్ కి కూతురు పాత్రలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అన్నీ కూడా పాత్రకు తగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నివేదా.. ఎక్కువగా సినిమాలలో నటించలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక తెలుగు చిత్రం మరొక మలయాళం చిత్రం మాత్రమే ఉన్నాయి. ఇక తాజాగా రెజీనా తో కలిసి ఈమె నటించిన శాకిని డాకిని సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

కొరియన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందని వారు చెబుతున్నారు.. సినిమా పోస్టర్స్ లో మాదిరిగానే కనిపించిన నివేద తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో మాత్రం ఎవరు ఊహించని విధంగా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ వీడియోలో తన తమ్ముడితో కలిసి డాన్స్ చేస్తూ ఉన్న నివేదా ను చూసి ప్రేక్షకులు పోల్చుకోవడానికి చాలా సమయం పట్టింది. మామూలుగా సినిమాలో సన్నగా కనిపించిన నివేద ఈ వీడియోలో చాలా లావుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version