MAA ELECTIONS : శివ బాలాజీ చెయ్యి కొరికిన నటి హేమ !

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రశాంతంగా నే ప్రారంభమైనప్పటికీ… తర్వాత.. మాత్రం పోలింగ్‌ కేంద్రం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యం లో ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌ పై మాజీ మా అసోషియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌ సంచలన ఆరోపణలు చేశారు.

పోలింగ్‌ కేంద్రం లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ దౌర్జన్యానికి దిగుతుందని.. తనకు, ప్రకాష్‌ రాజ్‌ కు గొడవ జరగలేదని చెప్పారు నరేష్‌. బయటివాళ్లు రాకూడదని ప్రకాశ్‌ రాజ్‌ కు చెప్పామని..కానీ శివ బాలాజీ చేయిని హేమా కొరికారని మండిపడ్డారు నరేష్‌.

దీనిపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు నరేష్‌. ఇక అటు మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ లో రింగింగ్‌ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు మంచు విష్ణు. కాగా… ‘మా’ ఎన్నికల్లో ఇప్పటి వరకు 287 ఓట్లు పోల్‌ అయ్యాయని ఎన్నికల అధికారి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news