డయాబెటిస్ ఏమో అని అనుమానమా..? ఈ లక్షణాలు ఉంటే అదే..!

-

మధుమేహం: చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు ఈరోజుల్లో డయాబెటిస్ బిపి వంటివి చాలా మందిలో కామన్ గా ఉంటున్నాయి.ఒక్కొక్కసారి ఏదైనా లక్షణం కనబడితే బాబోయ్ డయాబెటిస్ వచ్చేసిందేమో అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మధుమేహం తీవ్రమైన సమస్య. డయాబెటిస్ అనేక ఇతర సమస్యలకు కారణం అవుతుంది కూడా. దీనివలన జీవనశైలి మొత్తం మారిపోతుంది. డయాబెటిస్ ని ముందు మనం గుర్తించొచ్చు ఈ లక్షణాలు కనుక కనబడితే డయాబెటిస్ ఉన్నట్లు మనం ముందుగానే గుర్తించొచ్చు.

మధుమేహం

రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గుల కారణంగా మనకి డయాబెటిస్ అనేది వస్తుంది. సరైన డైట్ ని పాటిస్తే కచ్చితంగా డయాబెటిస్ తగ్గిపోతుంది. డయాబెటిస్ వచ్చే ముందు ఈ సంకేతాలు కనబడతాయి మరి వాటి కోసం ఎప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువ మూత్ర విసర్జన చేయడం డయాబెటిస్ కి సంకేతం. రక్తం లోని అదనపు గ్లూకోస్ స్థాయిలని స్థిరీకరించడానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమ పడతాయి దీంతో మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది.

డయాబెటిస్ రావడానికి ముందు గొంతు బాగా ఆరిపోతూ ఉంటుంది ఎక్కువ దాహం వేస్తుంది ఇది డయాబెటిస్ కి లక్షణమే. అలానే డయాబెటిస్ సమస్య వచ్చే ముందు చర్మం లో కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. చర్మ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మచ్చలు ఎక్కువగా చర్మం మీద వస్తూ ఉంటాయి. డయాబెటిస్ వచ్చే ముందు తలనొప్పి కాళ్లు చేతులు తిమ్మిరి ఎక్కడం అరికాళ్ళల్లో మంటలు కలగడం వంటివి కలుపుతాయి. ఇది కూడా మనం డయాబెటిస్ కి లక్షణం అని గుర్తుంచుకోవాలి.

డయాబెటిస్ రావడానికి ముందు మగవారిలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శృంగారం మీద కోరికలు తగ్గుతాయి. అంగంలో మంటగా ఉండడం వంటివి కలుగుతూ ఉంటాయి. ఇలా జరిగితే కూడా మనం డయాబెటిస్ అని గుర్తించాలి. చిగుళ్ళ నుండి రక్తస్రావం ఇన్ఫెక్షన్లు నొప్పి వంటివి కలిగితే కూడా డయాబెటిస్ కి సంకేతమే. డయాబెటిస్ వచ్చే ముందు జుట్టు బాగా రాలుతుంది కూడా ఇలా ఈ సంకేతాల ద్వారా మనం ఈజీగా డయాబెటిస్ వస్తుందని గుర్తించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version