కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

-

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆగ్రా లోని భీమ్ నగరి ప్రాంతంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఈదురు గాలులు బలంగా వీచాయి.దీంతో విద్యుత్ లైట్లు అమర్చిన ఓ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో రాజేష్ కుమార్ అనే(50) స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే గూటియారి లాల్ దూబేష్, ఆయన డ్రైవర్ కూడా ఉన్నారు.వీరందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా తప్పించుకున్నారు.

ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా 2009 లో రాజస్థాన్ లోని బికనీర్ నియోజకవర్గం నుంచి తొలిసారిలో తొలిసారిగా లోక్ సభ కు ఎన్నికయ్యారు మేఘ్వాల్.2013లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. గతంలో చీప్ విప్,మరియు భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండవ సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్లమెంటరీ వ్యవహారాలు & సంస్కృతికి ప్రస్తుత రాష్ట్ర మంత్రి భారతీయ జనతా పార్టీ సభ్యుడు మేఘ్వాల్ పని చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news