బ్యూటీ స్పీక్స్ : ఆ..తీపి తొలి దెబ్బ అందాల అలియాదే !

-

అలియా భ‌ట్ అనే పేరుకు తెలుగు తెర‌కున్న బంధం కొద్దిగానే కానీ అలియా భ‌ట్ అనే పేరు తొమ్మిదేళ్లుగా త‌న‌ని తాను నిరూపించుకునే తాప‌త్ర‌యంతోనే ఉంది అన్న‌ది వాస్త‌వం. వాస్త‌వాల‌ను స్థిరం చేసుకునే క్ర‌మంలో ఈ అమ్మ‌డు త‌న జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఊహల‌కు సంబంధించిన‌వే కదా వాస్త‌వ రూపం తీసుకుంటుంటాయి. క‌నుక మంచి ఊహ‌లు రంగుల ఊహ‌లు రంగుల ప్ర‌పంచం నుంచి ఎదిగి వ‌చ్చిన ఊహ‌లు వీటిని ఆమె త‌న  సొంతం చేసుకున్నా పేరు మ‌రియు కీర్తి కూడా త‌న సొంతం అయి ఉన్నాయి. మంచి న‌టి అనే పేరు ఒక‌నాటి ఊహ ఇప్పుడు వాస్త‌వం. హా అవును ! అలియా మంచి న‌టి.

ట్రిపుల్ ఆర్ అనే సినిమా ఓ చిన్న న‌మూనా అంతే ! అంత‌కుమించి ఏం కాదు. ఆమెకు న‌ట‌న ప‌రిధి ఎంతో తెలుసు. ఎంపిక చేసుకున్న పాత్ర‌కు ఓ వైవిధ్యం ఉంటే ఎంత పేరు వ‌స్తుందో కూడా తెలిసే ఉండాలి. ఉంటుంది కూడా! నాన్న మ‌హేశ్ భ‌ట్ ఇదే నేర్పి ఉండాలి. ఆయ‌న ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు అని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు అనే అనుకుంటాను. ఆమె పేరు చివ‌ర భ‌ట్ కారణంగా వ‌రుస అవకాశాలు రాలేద‌ని మొన్న‌నే చెప్పారు. భ‌ట్ కార‌ణంగా రాలేదు ప్ర‌తిభ మ‌రియు అందం అన్న‌వి ఓ కొల‌మానాలుగా ఉన్నాయి క‌నుక వ‌చ్చేయి అని కూడా మొన్న‌నే స్ప‌ష్టం చేస్తూ మీడియాకు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. కనుక మూవీ కెరియ‌ర్ ప‌రంగా ఆమె బాగున్నారు.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో వ‌చ్చే లేదా వ‌స్తున్న మార్పుల ప్ర‌కారం కూడా బాగుండాల‌న్న‌ది ఓ ఆశ. ఆమెను ఆరాధించే వారి ఆశ అని రాయాలి.

పెళ్లి మ‌రియు ప్రేమ మ‌రియు జీవితం ఈ ట్ర‌యోలో అలియా ఎక్క‌డ నెగ్గింది ఎక్క‌డ త‌న‌ని తాను నిరూపించుకున్నారు అన్న‌వి ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ప్రియ‌మ‌యిన అలియా మ‌న‌కు ట్రిపుల్ ఆర్ తో చేరువ అయింది అంత‌కుమునుపు స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ అనే  క‌ర‌ణ్ జోహార్ సినిమాతో ప‌రిచ‌యం అయ్యారు. అంటే మ‌న‌కు కాస్త ఆలస్యంగా చేరువ అయ్యారు అని అర్థం. 2012 అక్టోబ‌ర్ 19న విడుద‌ల‌యిన ఆ చిత్రంతో ఈ భామ  లేదా అందాల అతివ తెరంగేట్రం చేసి మంచి పేరుతెచ్చుకున్నారు. కెరియ‌ర్ ప‌రంగా  ఈ తొమ్మిదేళ్లూ ఏ లోటూ లేదు.

ఓ విధంగా చెప్పాలంటే ఆమెకు అభిన‌యం ప‌రంగా ఇత‌ర అగ్ర తార‌ల క‌న్నా గొప్ప గుర్తింపు ఉంది. అందుకే ఆమె ఎన్నో పుకార్ల‌ను అదేవిధంగా ఎన్నో అబ‌ద్ధ‌పు వార్త‌ల‌ను కాద‌ని త‌న కెరియ‌ర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. తొలుత చెప్పుకున్న‌విధంగా కెరియ‌ర్ చాలా బాగుంది అనే భావ‌న‌లో ఆమె ఎంతో ఉన్న‌తంగా ఉన్నారు. అదేవిధంగా వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఇప్పుడిప్పుడే సరిదిద్దాల‌నుకుంటున్నారు. పెళ్లితో అదే లేండి ప్రేమ పెళ్లి తో ఓ కొత్త బంధాన్ని స్థిరం చేసుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్నారామె. ర‌ణ‌బీర్ క‌పూర్ తో  పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. గ‌డిచిన వారంలో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచి ఎంతో మంది కుర్ర‌కారుకు కంటిపై ఇక కునుకు అన్న‌ది లేకుండా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news