బాలీవుడ్ నటుడు పరేష్ రావల్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛీఫ్ గా నియమింపబడ్డాడు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక ప్రహ్లాద్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు. పరేష్ రావల్ ని అభినందించిన మంత్రి, ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసాడు. అనుభవజ్ఞుడైన పరేష్ రావల్ ఆధ్యర్యంలో విద్యార్థులకి మేలు కలుగుతుందని తెలిపాడు.
పరేష్ రావల్ తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా చిత్రంలో లింగం మావయ్యగా కనిపించాడు. మూడు దశాబ్దాలకి పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకొన్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా 1994లో ఒకసారి, 2014లో మరోసారి అవార్డు అందుకున్నాడు. చిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలకి గాను భారత దేశం పద్మశ్రీతో సత్కరించింది.