లెబనాన్ రాజధాని బీరూట్ సీపోర్ట్ లో మళ్ళీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం వలన మంటలతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. బీరూట్ నౌకాశ్రయంలోని టైర్లు మరియు ఆయిల్ స్టోర్ చేసిన చోట మంటలు చెలరేగినట్లు లెబనాన్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. యుద్ద ప్రాతిపాదికన హెలీకాప్టర్ ల ద్వారా మంటలను అదుపులోకి తెస్తోంది లెబనాన్ ఆర్మీ.
అయితే ప్రమాదం జరిగినట్టు ప్రకటించారు కానీ ప్రమాదానికి కారణాలు మాత్రం ప్రకటించలేదు లెబనాన్ ప్రభుత్వం. ఆగష్టు 4 న జరిగిన భారీ పేలుడు ఘటన మరవకముందే మరోసారి ప్రమాదం జరగడంతో అక్కి జనాలు భయంతో వణికిపోతున్నారు. నెల క్రితం జరిగిన ఈ పేలుడు ఘటనలో 191 మంది మరణించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గో డౌన్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఊహలకందని విద్వంసాన్ని సృష్టించింది.