ఉత్తర్ప్రదేశ్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలు సంచలనం సృష్టించాయి. చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా జరిపిన సోదాల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారుల కంగుతిన్నారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆ డబ్బు లెక్కపెట్టలేక కౌంటింగ్ మెషీన్లే అలిసిపోయి ఆగిపోయాయి.
ఆ డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించగా.. సుమారు 42 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో కూడా 500 రూపాయల నోట్ల కట్టలు కోట్లల్లో లభ్యమయ్యాయి. వాటిని లెక్క పెట్టలేక యంత్రాలే మొరాయించాయి.