హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు..వ్యక్తి ఢీ కొట్టి మరీ !

-

hit and run Case: హైదరాబాద్ మహా నగరంలో వరుసగా హిట్ అండ్ రన్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే.. తాజాగా హైదరాబాద్ నల్లకుంట పోలిస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఈ నెల 18వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

A case of hit and run has been registered in Hyderabad Nallakunta police station

TS09FJ0574 నెంబర్ గల రెడ్ కలర్ కారుతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళుతున్న వ్యక్తిని ఢీ కొట్టి పరారీ అయ్యాడు కారు డ్రైవర్‌. ఇక ఆ కారులో మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. హిట్ అండ్ రన్ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డు చేసిన స్థానికులు..అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

కారు వెనుక మినిస్టరి అప్ రోడ్స్ అండ్ హైవేస్ పేరుతో ఉందని స్థానికులు గుర్తించారు. ఇక స్థానికుల సమాచారం మేరకు హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news