ఉత్తరాఖండ్‌లోపెను విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు అయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతోంది. కాగా ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ దాటికి కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. భారీ వరద ప్రవాహం వల్ల వందలాది ఇళ్లు నీటిమట్టం అయ్యాయి. ప్రజలు భయంతో వారి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు
ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్
ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు https://t.co/oZCPuWmCQ7 pic.twitter.com/rqct1agS68
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025