World Cup 2023 : తగ్గేదేలే.. 10 మ్యాచుల్లో 12 సెంచరీలు

-

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు పది మ్యాచ్లు జరగ్గా….12 సెంచరీలు నమోదు అయ్యాయి. వీటిలో దక్షిణాఫ్రికా ప్లేయర్లు 4, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ప్లేయర్లు చెరువు 2, ఇంగ్లాండ్, భారత ప్లేయర్లు చెరో సెంచరీ చేశారు.

మరోవైపు బౌలర్లలో న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ సాంట్నర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. అత్యధిక పరుగుల జాబితాలో రెండు సెంచరీల హీరో డికాక్(209) తొలి స్థానంలో ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా…. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 11వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news