ఒడిస్సా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంఘటన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒడిశాలో గూడ్స్ రైలును ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. 5 బోగీల పట్టాలు తప్పాయి. ఇక ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.
బాలాసోర్‌కు 40కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 233 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకు… 50 మంది మరణించగా… ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ 233 కు చేరింది. ఇంకా భోగిల మధ్య శవాలు బయటపడే ఛాన్స్ ఉన్నప్పుడు సమాచారం అందుతుంది.