ఈవీఎంలను హ్యాక్ చేయగలనని చెప్పిన ఓ వ్యక్తిపై ముంబైలో పోలీస్ కేసు నమోదు అయింది. మిషన్ ఫ్రీక్వెన్సీ లను వేరు చేయడం ద్వారా ఈవీఎంలను క్యాంపరింగ్ చేయగలనంటూ సోషల్ మీడియాలో అతను చెప్పడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అవి తప్పుడు నిరాధారమైన వాదనలు అని స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నీ హ్యాక్ చేయడంతో పాటు క్యాంపరింగ్ చేయగలను అంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల హ్యాక్ చేయడం గురించి చెప్పినట్టు తెలుస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం.. అతడిని సయ్యద్ షూజగ గుర్తించింది. మహారాష్ట్ర చీప్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ముంబై పోలీసులు నవంబర్ 30న కేసు నమోదు చేశారు. ఈవీఎంలపై తప్పుడు వాదనలు చేస్తున్న ఈ వ్యక్తిపై 30 సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల్లోను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతనిపై ఢిల్లీలో ఓ కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఇతను ఇతర దేశంలో ఉన్నాడని ఈసీ వెల్లడించింది.