జమ్ముకశ్మీర్ ఎన్నికలు.. విదేశీ దౌత్యవేత్తల బృందం పరిశీలన!

-

జమ్ముకశ్మీర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండోవిడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీ భద్రత నడుమ అక్కడి పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జమ్ములో జరుగుతున్న ఎన్నికల తీరును అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం పరిశీలిస్తోంది.ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా శ్రీనగర్‌లోని పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించారు.

అమెరికా, మెక్సికో, గయానా, దక్షిణకొరియా, సోమాలియా, పనామా, సింగపూర్‌, నైజీరియా, స్పెయిన్‌, దక్షిణాఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండ, అల్గేరియా, ఫిలిప్పీన్స్‌ సహా వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్ములో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలిస్తున్నారు.ఇక ఆరు జిల్లాల్లోని 26 సెగ్మెంట్లలో పోలింగ్ కొనసాగుతుండగా.. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గండేర్‌బల్, బడ్‌గామ్‌ స్థానాల్లో పోటీలో నిలవగా..కాంగ్రెస్ నేత తారిఖ్‌ హమీద్‌ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నుంచి బరిలో నిలిచారు.ప్రస్తుతం శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news