యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 22న నోవాటెల్ హోటల్ లో అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. ఈ ఈవెంట్ కి శ్రేయాస్ మీడియా అంతా సిద్ధం చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తాకిడి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ చేయలేక ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు మూవీ మేకర్స్.
తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు పై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. జూ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారు. మేము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ లు చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళు. సినిమా ఫంక్షన్ తో పాటు.. అన్ని మతాల పండుగులను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. దేవర విషయంలో రేవంత్ రెడ్డి భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోయారని ప్రశ్నించారు.