West Bengal Train Accident: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ !

-

West Bengal Train Accident: బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు(సోమవారం) ఉదయం డార్జిలింగ్ జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు కంచన్‌జుంఘా ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా రంగపాణి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును వెనుక నుంచి రైలు ఢీ కొట్టింది.

A terrible train accident in Bengal

ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 200 మంది ప్రయాణికులు ఈ సంఘటనలో గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ రైలు ప్రమాదం జరిగిన వద్ద భయానక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.  దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news