స్వాతీ మాలీవాల్ కేసుపై విచారణ.. దిల్లీ హజారీ కోర్టులో హైడ్రామా

-

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసుపై ఇవాళ దిల్లీ హజారీ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో హైడ్రామా నడిచింది. ఎంపీ స్వాతి మాలివాల్ కోర్టులో కన్నీరు పెట్టుకొన్నారు. ఓ యూట్యూబర్‌ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హజారీ కోర్టులో విచారణ జరిగింది. అతడి లాయర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే దాడి జరిగినట్లు మహిళా ఎంపీ చెబుతున్నారని ఆరోపించారు. మే 13న ఆమె సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణే అని కోర్టుకు వెల్లడించారు. ఈ ఆరోపణలను విన్న మాలీవాల్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై.. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటినుంచి బీజేపీ ఏజెంటని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆప్‌ వాలంటీర్‌గా పనిచేసిన ఓ యూట్యూబర్‌ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్టు చేసిన నాటినుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news