T20 World Cup: న్యూయార్క్ చేరుకున్న ఇండియన్ క్రికెటర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది.మరో 5 రోజుల్లో (జూన్ 2) టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో జట్లన్నీ అమెరికాలో అడుగుపెట్టనున్నాయి. తాజాగా టీమిండియా న్యూయార్క్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్‌డౌన్‌ న్యూయార్క్‌’ అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) లో షేర్‌ చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే ఇండియా క్రికెట్ బృదం అమెరికా శనివారం (మే 25) బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రయాణ బృందంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ప్రధాన క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా,సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా,శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.విరాట్ కోహ్లీ మే 30వ తేదీ ఉదయం న్యూయార్క్‌కు వెళ్తాడు. కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అమెరికా ప్రయాణం ఆలస్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news