దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ విచారణలో వెలుగులోకి వస్తున్న లింకులతో మరికొందరికి నోటీసులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఈడీ నోటీసులు అందుకున్న పలువురు విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈడీ అధికారులు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి ఎంపీ నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు దిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం దిల్లీలోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపినట్లు తెలిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.