BREAKING : ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం

-

ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం అయింది. వాహక నౌక నుంచి విడిపోయింది ఉపగ్రహం. ఆదిత్య L-1ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది PSLV C-57 రాకెట్. దీంతో షార్‌లో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 4 నెలల పాటు ప్రయాణించి ఎల్-1 పాయింట్‌కు చేరుకోనుంది శాటిలైట్.

ఆదిత్య L1 సక్సెస్
ఆదిత్య L1 సక్సెస్

కాగా, కాసేపటి క్రితమే సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వీ సి-57 ఉపగ్రహ వాహక నౌక ఆదిత్య ఎల్-1 ను మోసుకెళ్లింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్వేజ్ పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ -1 చేరుకోవడానికి 125 రోజులు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news