మోదీ కేబినెట్​లో 99% మంత్రులు కోటీశ్వరులే

-

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారులో ఉన్న 71మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వారి సగటు ఆస్తుల విలువ రూ.107.94 కోట్లు అని తెలిపింది. ముఖ్యంగా ఆరుగురు మంత్రుల ఆస్తుల విలువ మాత్రం భారీగా ఉందని పేర్కొంది. వీరిలో అత్యధిక ఆస్తులు కలిగిన కేంద్రమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.5705.47 కోట్లు. వీటిలో దాదాపు రూ.5598.65 కోట్ల చరాస్తులు, రూ.106.82 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు.

రెండో స్థానంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా(రూ.424.75 కోట్లు) ఉన్నారు. మూడో స్థానంలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎంపీ హెచ్‌డీ కుమారస్వామి (రూ. 217.23 కోట్లు) ఉన్నారు. నాలుగో స్థానంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ (బీజేపీ (రూ. 144.12 కోట్లు)) ఉన్నారు. ఐదో స్థానంలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ (రూ.121.54 కోట్లు)) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news