లోక్సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం ఓట్లు తగ్గినట్లు తెలిపింది. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 279మంది తమ నియోజకవర్గాల్లో సగానికి పైగా ఓట్లు సాధించారని పేర్కొంది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 542 స్థానాల్లో ఓట్ల షేరింగ్పై సమగ్ర విశ్లేషణను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) 2024 విడుదల చేశాయి. సూరత్ స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినందుకున్న దానిని విశ్లేషణ నుంచి మినహాయించాయి. ఈ నివేదిక ప్రకారం బీజేపీకి చెందిన 239 మంది విజేతల్లో 75 మంది (31 శాతం).. కాంగ్రెస్‌కు చెందిన 99 మంది విజేతల్లో 57 మందికి (58 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించారు.
ప్రాంతీయ పార్టీల్లో 50% కంటే తక్కువ ఓట్లు సాధించిన వారు ..
సమాజ్‌వాదీ పార్టీ నుంచి 37 మంది విజేతల్లో 32 మంది (86 శాతం)
టీఎంసీ నుంచి 29మందిలో 21 మంది (72 శాతం)
డీఎంకే నుంచి 22 మందిలో 14 మంది (64 శాతం)