కర్ణాటకలో ప్రయాణికులకు బిగ్ షాక్. త్వరలో బస్సు టికెట్ రేట్లు పెరుగనున్నాయి. ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. నష్టాల్లో కూరుకుపోయింది కేఎస్ఆర్టీసీ. త్వరలో బస్సు టికెట్ రేట్లు పెంచాలనుకుంటోందట కేఎస్ఆర్టీసీ. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి 295 కోట్ల నష్టం వాటిల్లడంతో.. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోకుండా బస్సు టికెట్ రేట్లు 15 నుండి 20 శాతం పెంచాలనుకుంటోందట కేఎస్ఆర్టీసీ.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుండగా, ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 నష్టం వాటిల్లిందట. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసారూ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. తాజాగా మీడియాతో టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 నష్టం వాటిల్లిందన్నారు.