కోపా అమెరికా ఛాంపియన్‌గా అర్జెంటీనా.. 16వ టైటిల్ కైవసం

-

అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు మరోసారి తమకు తిరుగులేదని నిరూపించింది. ప్రపంచంలోనే పురాతనమైన కోపా అమెరికా టోర్నీలో ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఘన చరిత్ర ఉన్న అర్జెంటీనా జట్టు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 23 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగుపెట్టిన కొలంబియాపై 1-0 తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో తొలి రెండు అర్ధ భాగాల్లో (90 నిమిషాల్లో) రెండు టీమ్‌లు గోల్స్‌ చేయలేకపోయాయి. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌ కేటాయించారు. 112వ నిమిషంలో అర్జెంటీనా క్రీడాకారుడు మార్టినేజ్‌ గోల్‌ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో 1-0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. అర్జెంటీనాకు ఇది 30వ ఫైనల్‌ కాగా.. 16వ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇక అర్జెంటీనా 16వసారి కోపా అమెరికా టైటిల్ ఖాతాలో వేసుకొని అత్యధిక సార్లు నెగ్గిన ఉరుగ్వే (15) రికార్డును బ్రేక్ చేసింది.

ఇక కోపా అమెరికా టోర్నీలో గెలిచిన అర్జెంటీనా జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వెల్ డన్ అర్జెంటీనా అంటూ సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news