ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల్ని గుర్తించేందుకు ఏఐ

-

ఒడిశాలో రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 280కి పైగా మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది మృతదేహాలు ఇప్పటి వరకు గుర్తింపునకు దోచుకోలేదు. అయితే మృతులను గుర్తించేందుకు రైల్వే శాఖ అధునాతన సాంకేతికతపై ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌ కార్డులు సహా సాంకేతికంగా ఏ చిన్న ఆధారం లభ్యమైనా మృతదేహాలను ఆయా కుటుంబాలవారికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది. 288 మంది మృతుల్లో 83 మంది గుర్తింపు ఇంతవరకు పూర్తికాలేదు.

మృతుల వేలిముద్రలు సేకరించి, వారి ఆధార్‌ వివరాల ద్వారా కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు ‘విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్‌) బృందాన్ని బాలేశ్వర్‌కు పిలిపించాలని తొలుత భావించారు. చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడంతో అది ఫలించలేదు. దీంతో కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సంచార్‌ సాథీ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు. 64 మృతదేహాల విషయంలో ఈ పోర్టల్‌పై ఆధారపడగా 45 కేసుల్ని విజయవంతంగా గుర్తించగలిగింది. మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలను ఈ పోర్టల్‌ సమకూర్చింది. వీటి ఆధారంగా కుటుంబ సభ్యుల్ని సంప్రదించినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news