కమలంలో కోవర్టులు రచ్చ..ఎవరా నలుగురు?

-

మొన్నటివరకు అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోనే ఆధిపత్య పోరు కనిపించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా బి‌జే‌పి లో కూడా రచ్చ మొదలైంది. మామూలుగానే అధికార పార్టీలో నేతలు ఎక్కువ ఉంటారు కాబట్టి..అక్కడ ఆధిపత్య పోరు కామన్. ఇక కాంగ్రెస్ లో మొదట నుంచి ఈ రచ్చ జరుగుతూనే ఉంటుంది. సొంత పార్టీ నేతలే వీధికెక్కి తిట్టుకుంటారు. అలాంటి పరిస్తితి కాంగ్రెస్ లో ఉంటుంది. కానీ ఈ మధ్యే కాంగ్రెస్ లో పోరు తగ్గింది..నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు.

కానీ ఇప్పుడు బి‌జే‌పిలో రచ్చ మొదలైంది. అంతకముందు కూడా అంతర్గతంగా పోరు ఉండేది ఏమో గాని..అది పెద్దగా బయటపడేది కాదు. ఇక ఎప్పుడైతే ఈటల రాజేందర్..పొంగులేటి, జూపల్లిలని కలిసి బి‌జే‌పిలో ఆహ్వానించడం, వారి భేటీ గురించి తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడంతో..బండి, ఈటల మధ్య గ్యాప్ ఉందని అర్ధమైంది. పలు సందర్భాల్లో ఆ అంశంపై క్లారిటీ వచ్చింది. ఇక ఇదే సమయంలో కొత్తగా బి‌జే‌పిలోకి వచ్చిన ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి..ఇంకా కొందరు నేతలు ఒక గ్రూపుగా ఉన్నారనే ప్రచారం వస్తుంది.

ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..పార్టీలో కోవర్టులు ఉన్నారని బాంబ్ పేల్చారు. ఈయన కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి నెక్స్ట్ టి‌డి‌పిలోకి వెళ్ళి తర్వాత బి‌జే‌పిలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై రచ్చ నడుస్తుంది. పార్టీలో ముగ్గురు, నలుగురు కోవర్టులు ఉన్నారని, వారు త్వరగా మనసు మార్చుకుంటే మంచిదని లేదంటే తాను మీడియా ముందు చెబుతానని అంటున్నారు.

ఇదే క్రమంలో నందీశ్వర్ గౌడ్ పార్టీ మారతారని ప్రచారం వస్తుంది. అయితే కోవర్టుల్లో ఒకరు తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీ మారే ప్రసక్తి లేదని అంటున్నారు. ఏదేమైనా గాని నందీశ్వర్ వ్యాఖ్యలు బి‌జే‌పిలో సెగలు పుట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news