పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్..!

-

మీరు ట్యాక్స్ పే చేస్తున్నారా..? అయితే మీకు ఓ ముఖ్యమైన అలెర్ట్. కచ్చితంగా మీరు ఏ ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకోవాలి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ కొన్ని గంటల పాటు పని చేయదు అని తెలుస్తోంది. కనుక పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని గమనించడం మంచిది.

 

incometax

చాలా మంది వీకెండ్‌ లో ట్యాక్స్ ఫైలింగ్ చెయ్యాలని అనుకుంటూ వుంటారు. కానీ వారికి ఇబ్బంది అవుతుంది. శనివారం అనగా నిన్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ పని చెయ్యలేదు. అదే విధంగా ఆదివారం అనగా ఈరోజు కూడా కొన్ని గంటల పాటు ఈ కొత్త ట్యాక్స్ పోర్టల్ పని చెయ్యదు అని తెలుస్తోంది.

షెడ్యూల్డ్ మెయింటెన్స్‌లో కారణం వలెనే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ కొన్ని గంటల పాటు పని చేయదని తెలుస్తోంది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొత్త ట్యాక్స్ వెబ్‌సైట్ సేవలు పొందడానికి అవ్వదు. కనుక ఈ విషయాన్ని ట్యాక్స్ పే చేసే వారు గమనించడం మంచిది.

ఈ సమయంలో ఇఫైలింగ్ పోర్టల్‌ లో ఐటీఆర్ దాఖలు, డిజిటల్ సిగ్నేచర్ రిజిస్టర్, ఫామ్ 26 ఏఎస్ డౌన్‌లోడ్ లాంటి సేవలని పొందడానికి అవ్వదు. ఇది ఇలా ఉంటే జూన్ 7న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news