Bigg Boss 5 Telugu: హౌస్ లో మోస్ట్ క్యూట్ క‌పుల్స్! ఆ జంట ఎవ‌రిదంటే?

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 5 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎవరూ ఊహించ‌ని ట్వీస్టులు, చిత్ర విచిత్ర‌మైన‌ టాస్కులు. ఇలా ర‌క‌రకాల స‌ర్ ప్రైజ్ ల‌తో ఎప్పుడూ లేని విధంగా షో ను ఆస‌క్తిగా సాగుతోంది. ఇలా నిత్య నూత‌నంగా మార్పులు చేస్తూ.. ప్రేక్ష‌కుల మ‌న‌స్సును దోచుకుంటుంది బిగ్ బాస్ టీం.. వారాంతం వ‌చ్చిందంటే..బిగ్ బాస్ హౌస్‌లో సందడి రెట్టింపు అవుతుంది. హోస్ట్ నాగార్జున చేసే హడావిడితో హౌస్ మేట్స్‌లో జోష్ మరింత పెరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో వారం రోజుల పాటు జరిగిందంతా రీవైండ్ చేస్తారు. ఒక్క‌రిని ప‌లుక‌రించుకుంటూ క్లాస్ తీసుకుంటారు. ప్ర‌సంశిస్తారు. అవ‌స‌ర‌మైతే.. ఛీవాట్లు పెడుతారు. నిన్నటి ఎపిసోడ్ చాలా ఆస‌క్తికరంగా జ‌రిగింది.

ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, ఆర్జే కాజ‌ల్ సేఫ్ చేశారు. ఇక‌.. లోబో, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఉన్నారు. నిన్న‌టి ఎపిసోడ్ లో ప్రియ తీరును ప్ర‌శ్నిస్తున్నారు నాగార్జున‌. స‌న్నీపై పూల‌కుండి ఎత్త‌డం, చెంప ప‌గ‌ల‌గొడ‌తా అన‌డమేంట‌ని ప్ర‌శ్నించారు. కొట్టుకునేంతవరకు వెళ్లింది వారిద్దరి మధ్య గొడవ. ఈ గొడ‌వ హైలైట్ గా నిలిచింది. ఓ ర‌కంగా చెప్పాలంటే.. మిని సైజ్ వారే జ‌రిగిందని చెప్పాలి.

అనంత‌రం .. పెళ్లి సంబంధాల టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో మానస్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్‌లు పాల్గొన్నారు. ఈ టాస్కులో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వాళ్ళకి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలని అన్నారు.

ముందుగా శ్రీరామ్‌.. తాను పెళ్లి చేసుకునే.. అమ్మాయి బ‌బ్లీగా.. అంద‌రితో క‌లుపుకోలుగా ఉండాల‌న్నాడు సింగ‌ర్ శ్రీ‌రామ్. ఇక సన్నీ.. త‌న‌దైన శైలిలో చెప్పారు. త‌న‌కు కాబోయే అమ్మాయి నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం ఉండాల‌ని చెప్పాడు. త‌రువాత‌.. ప్రియాంక త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది. తాన‌ను కేరింగ్ గా చూసుకునే అబ్బాయి కావాల‌ని.. అత‌న్ని కూడా చూపించే ప్రియాంక లాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పాడు.

ఇక మానస్‌.. నేను ఎక్కువగా అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి అని తెలిపాడు. అనంత‌రం.. ఇంటి సభ్యులంతా ప్రియాంక – మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా ఎన్నుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ ‘గువ్వా గోరికంతో’ పాటకు జంటగా స్టెప్పులేసి అదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news