అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

-

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీ అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ). ఈ విశ్వవిద్యాలయానికి ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమె నియామకానికి ఆమోద ముద్ర వేశారు. అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయూకు తొలి మహిళా వీసీగా వచ్చారు. అయిదేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ వర్సిటీకి నయీమానే తొలి మహిళా వైస్ ఛాన్సలర్.

ఏఎంయూలోనే సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు నయీమా. అదే విభాగంలో లెక్చరర్‌గా 1988లో ఎంపికయ్యారు. 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన ఆమె 2014 నుంచి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. నయీమా భర్త ప్రొఫెసర్‌ మహమ్మద్‌ గుల్రెజ్‌ నిరుడు ఏఎంయూ తాత్కాలిక వీసీగా బాధ్యతలు చేపట్టారు. 1920లో బేగమ్‌ సుల్తాన్‌ జహాన్‌ ఏఎంయూ కులపతిగా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news