జమ్మూకశ్మీర్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా అక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరదలు పోటెత్తాయి.
దీంతో.. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకున్నారు. పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అమర్ నాథ్ యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా పూర్తి గా ధ్వంసం అయ్యాయి.
మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని సమాచారం అందుతోంది. ఈ విపత్తులో ఏకంగా 13 మంది మరణించారు. అలాగే.. 40 మందికి పైగా గల్లంతు అయ్యారు. అటు జమ్మూకాశ్మీర్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. అమర్నాథ్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.