కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 500 ఏళ్ల క్రితం ఏర్పడిన లోతైన గాయానికి అయోధ్య రామాలయం వైద్యం లాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. వందల ఏళ్లుగా భక్తులు ఆలయం కోసం చూస్తున్నారని అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
‘మన విశ్వాసాలను గౌరవిం చేందుకు పాత ప్రభుత్వాలు భయ పడేవి. ఔరంగజేబు ద్వంసం చేసిన కాశీ విశ్వనాథ ఆలయాన్ని, బాబర్ ధ్వంసం చేసిన రామ మందిరాన్ని ప్రధాని మోదీ పునర్నిర్మించారు’ అని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
కాగా, అయోధ్య బాల రాముడి పేరు మారింది. అయోధ్య రామ మందిరంలో కొలువైన బాల రాముడిని ఇకనుంచి ‘బాలక్ రామ్’ గా పిలవనున్నట్లు రామ జన్మభూమి ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని చెప్పారు.