చారిత్రక గోల్కొండ కోటలో సౌండ్ అండ్‌ లైట్ షో

-

చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో సౌండ్ అండ్‌ లైట్ షోనుం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా ఇకపై రాత్రిళ్లు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ఇల్యుమినేట్ చేసింది. గోల్కొండ కోటలో పర్యాటకులు, సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లను చేసే కార్యక్రమంలో భాగంగా సౌండ్ అండ్‌ లైట్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమాలను కేంద్ర సాంస్కృతిక శాఖ చేపట్టింది.

సౌండ్ షో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల సమయం ఉంటుంది. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3డీ మ్యాపింగ్‌ ప్రొజెక్షన్‌, హై-రెజల్యూషన్‌ ప్రొజెక్టర్లు, లేజర్‌ లైట్లు, మూవింగ్‌ హెడ్స్‌ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. దీన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news