లోక్సభ పోరులో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్!

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఈ విషయాన్ని అతడి తరఫున న్యాయవాది రాజ్దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు. అది కూడా జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారని రాజ్దేవ్ వెల్లడించారు. అమృత్పాల్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అతణ్ని కలిసేందుకు బుధవారం తాను జైలుకు వెళ్లినప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అమృత్పాల్ చెప్పినట్లు రాజ్దేవ్ పేర్కొన్నారు. ఏ పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు

ఈ విషయంపై అమృత్పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ స్పందిస్తూ.. తన కుమారుడు ఇంతకుముందు రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని తెలిపారు. తాను తొలిసారిగా వింటున్నానని అన్నారు. జైల్లో ఉన్న అమృత్పాల్ను కలిశాకే ఈ విషయంపై తాను మాట్లాడతాని చెప్పారు. మరోవైపు ఖదూర్ సాహిబ్ నియోజకవర్గానికి చివరి విడతలో జూన్ 1వ తేదీన పోలింగ్ జరగునుంది. పంజాబ్లో ఉన్న 13 లోక్ సభ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news